పుట్టినరోజునాడు డబుల్ ట్రీట్ ఇవ్వనున్న తారక్ !
Published on May 16, 2018 8:25 am IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 28వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మొదటిసారి పనిచేస్తుండటంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ నెల 20న ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను విడుదలచేస్తారట టీమ్.

మరోవైపు తారక్ చరణ్ తో కలిసి రాజమౌళి సారథ్యంలో భారీ మల్టీ స్టారర్ కు సన్నద్ధమవుతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే మొదలుకానుంది. 20న తారక్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాకు సంబందించిన ముఖ్యమైన ప్రకటనను చేయనున్నారట. దీంతో అభిమానులకు ఒకేసారి డబుల్ ట్రీట్ లభించనుంది. అయితే ఈ వార్తలపై ఇంకా ఆయా చిత్ర వర్గాల నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook