‘గోవిందుడు అందరివాడెలే’కి మొదలైన డబ్బింగ్

Published on Jul 18, 2014 12:43 pm IST

govindudu-andarivadele

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు ఇటీవలే శబ్దాలయా స్టూడియోస్ లో లాంచనంగా ప్రారంభమయ్యాయి. మొదట ఈ సినిమాలో నటించిన నటీనటులు డబ్బింగ్ చెబుతున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర టీం హైదరాబాద్ లో షూటింగ్ చేస్తోంది.

జూలై 20 నుంచి ఈ సినిమా తాజా షెడ్యూల్ పొల్లాచ్చిలో మొదలు కానుంది. రామ్ చరణ్ పోనీ టెయిల్, స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :