సాహో తో పాటే ప్రభాస్ తరువాత ప్రాజెక్ట్ సిద్ధం!
Published on Oct 5, 2017 8:36 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి ఇచ్చిన క్రేజ్ తో మంచి ఊపు మీద ఉన్నాడు. ఇదే స్పీడ్ లో సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. అయితే సాహో పూర్తి అయిన వెంటనే ప్రభాస్ వెంటనే మరో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు.

జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తరువాత సినిమా ఉంటుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో ప్రభాస్ మరో సారి లవర్ బాయ్ గా చేస్తున్నాడు. సాహో షూటింగ్ తో పాటు ఈ నెక్స్ట్ సినిమా షూటింగ్ కూడా సమాంతరంగా జరుగుతుందని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. ఈ సినిమాకి సంబంధించి నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు త్వరలో తెలియజేసే అవకాశం ఉంది.

 
Like us on Facebook