‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్!
Published on Nov 21, 2016 12:00 pm IST

ekkadiki-pothavu-chinnavada
హ్యాట్రిక్ హిట్స్‌తో వచ్చిన జోరును ‘శంకరాభరణం’తో అందుకోలేకపోయిన నిఖిల్, తాజాగా చాలా జాగ్రత్తలు తీసుకొని, తనకు బాగా కలిసివచ్చిన ప్రయోగాన్నే నమ్ముకొని ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అంటూ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. మొదట్నుంచీ విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా, అంతా అనుకున్నట్టుగానే సరికొత్త కాన్సెప్ట్‌తో, అదిరిపోయే కామెడీతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో దేశమంతా డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిన ఈరోజుల్లోనూ ఎక్కడికి పోతావు చిన్నవాడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‍గా నిలబడడం విశేషంగా చెప్పుకోవాలి.

మొదటిరోజే హిట్ టాక్ వచ్చేయడంతో వారాంతమంతా సినిమా కలెక్షన్స్ జోరు కొనసాగించింది. మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 6.10 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన సినిమా నిఖిల్ కెరీర్‌కే అతిపెద్ద ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. గత రెండు వారాలుగా వెలవెలబోయిన సినీ పరిశ్రమకు ఈ సినిమా కొత్త ఉత్సాహం తీసుకొచ్చిందనే చెప్పాలి. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నందిత శ్వేత, హెబ్బా పటేల్‌లు హీరోయిన్లుగా నటించారు.

ప్రాంతాల వారీగా కలెక్షన్స్ (షేర్) వివరాలు ఇలా ఉన్నాయి..

ఏరియా కలెక్షన్స్ (రూపాయల్లో)
నైజాం : 1.70 కోట్లు
సీడెడ్ : 50 లక్షలు
వైజాగ్ : 48 లక్షలు
తూర్పు గోదావరి : 32 లక్షలు
పశ్చిమ గోదావరి : 21 లక్షలు
కృష్ణా : 34 లక్షలు
గుంటూరు : 42 లక్షలు
నెల్లూరు : 13 లక్షలు
యూఎస్‌ఏ : 1.35 కోట్లు
కర్ణాటక : 65 లక్షలు
మొత్తం : 6.10 కోట్లు

 
Like us on Facebook