ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో “ఏమైపోతానే”…రిలీజ్ కి రెడీ!

ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో “ఏమైపోతానే”…రిలీజ్ కి రెడీ!

Published on Jun 20, 2022 12:00 PM IST

సినిమా పరిశ్రమలో ఎన్ని రకాల జోనర్ లలో సినిమాలు వచ్చినా, ప్రేమకథా జోనర్ సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కుతుంటుంది. ప్రేక్షకులలో మంచి ఫీలింగ్ ని కలిగించే ఈ సినిమాలు మంచి హిట్స్ అవుతూ ఉంటాయి కూడా, అలా ఫీల్ గుడ్ ప్రేమకథగా తెరకెక్కిన సినిమా ఏమైపోతానే. అమర్ లతు, చాందిని పౌర్ణమి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా లో విజయ్ రామ్, జె. నరేష్ రెడ్డి, శివ నరిశెట్టి, సరిపల్లి సతీష్, సుజాత, మహేంద్ర నాథ్, భలే రావు, రవళి తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది. సురేష్ కుమార్ కుసిరెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా కి వసంత్.జి సంగీతం సమకూర్చారు. కె. వెంకటేష్ సినిమాటోగ్రాఫర్ గా చేయగా శివ శార్వాణి ఎడిటింగ్ అందించారు. కాగా ఈ సినిమా జులై 1వ తేదీన విడుదల అవుతుంది.

ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత సురేష్ కుమార్ కుసిరెడ్డి మాట్లాడుతూ, “ప్రేమకథా సినిమా గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని భావిస్తున్నాను. పాటలకు ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల ప్రీమియర్ షో కి వచ్చిన రెస్పాన్స్ కూడా మర్చిపోలేనిది. ఆరోజు అందరి స్పందన నాకు ఈ సినిమాపై మంచి కాన్ఫిడెన్స్ ను పెంచింది. ఈ సినిమా లో మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమాలో నటించిన, పనిచేసిన అందరు కూడా ఎంతో బాగా సపోర్ట్ చేశారు. జులై 1 న ఈ చిత్రం అందరి ముందుకు రాబోతుంది” అని అన్నారు.

అమర్ లతు, చాందిని పౌర్ణమి, విజయ్ రామ్, జె. నరేష్ రెడ్డి , శివ నరిశెట్టి, సరిపల్లి సతీష్, సుజాత, మహేంద్ర నాథ్, భలే రావు, రవళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత సురేష్ కుమార్ కుసిరెడ్డి, రచన, దర్శకత్వం సురేష్ కుమార్ కుసిరెడ్డి, మ్యూజిక్ వసంత్.జి, సినిమాటోగ్రఫీ కే .వెంకటేష్, ఎడిటర్ శివ శార్వాణి, కో డైరెక్టర్ నాని బాబు, డిఐ ఆర్యన్ మౌళి, మిక్సింగ్ విష్ణు, పి.ఆర్‌.ఓ సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు