ప్రస్తుతం టాలీవుడ్ యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ ఎంటర్టైనర్ చిత్రాల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రం ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కూడా ఒకటి. ‘ఈNఈ రిపీట్’ అంటూ ప్లాన్ చేసిన ఈ సినిమా ఈ నవంబర్ లోనే రిలీజ్ కి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక లేటెస్ట్ గా మేకర్స్ సరికొత్త పోస్టర్ తో వివేక్ అండ్ గ్యాంగ్ ఆన్ టైం ల్యాండ్
అవుతున్నట్టుగా రిలీజ్ డేట్ ని మరోసారి ఖరారు చేశారు. దీనితో ఈ సినిమా ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా విశ్వక్ సేన్ తో పాటుగా అభినవ్ గోమఠం, శ్రీకాంత్ మేగంటి అలాగే వెంకటేష్ కనుమను ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా వారు నిర్మాణం వహిస్తున్నారు.


