ఈ ఏడాది ఆరంభంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తన రాజా సాబ్ తో భారీ సినిమాని తీసుకొచ్చాడు. దర్శకుడు మారుతీతో చేసిన ఈ ఫాంటసీ హారర్ కామెడీ ఊహించని ఫలితాన్ని చూడాల్సి వచ్చింది. గ్రాండ్ విజువల్స్ ఉన్నప్పటికీ సినిమా ఫ్యాన్స్ ని, ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.
ఇక ఈ సినిమా ఫలితంపై లేటెస్ట్ గా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం వైరల్ గా మారింది. రాజా సాబ్ సినిమా సంక్రాంతి సీజన్ లో కాకుండా మరో సమయంలో వచ్చి ఉంటే తప్పకుండ ఫలితం వేరేలా ఉండేది అని తెలిపారు.
దీనితో ఆ సినిమా విషయంలో కేవలం విడుదల చేసిన సీజన్ తమ సినిమాని ఎఫెక్ట్ చేసింది అని తప్పితే తమ నుంచి బెస్ట్ వర్క్ నే అందించాము అని చెప్పకనే చెప్పారు. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఆ సినిమా ఫలితాన్ని మార్చడానికి లేదు. ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ‘గరివిడి లక్ష్మి’ అనే రూటెడ్ ఎంటర్టైనర్ రాబోతుంది. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో ఈ అక్టోబర్ 17న చూడాలి.


