టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ రోమ్ కామ్ చిత్రమే ‘అలియాస్ రుక్మిణీ’. నాచురల్ స్టార్ నాని నిర్మాణం వహిస్తున్న ఈ సినిమాని దర్శకుడు మురళీకాంత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విషయంలో మొదటి నుంచీ ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో మేకర్స్ ఆడియెన్స్ ని పలకరిస్తూ వచ్చారు. ఇక ఇందులో రుక్మిణి ఎవరు అనేది సస్పెన్స్ గానే ఉంచుతూ వచ్చారు.
కానీ ఫైనల్ గా ఆమె ఎవరు అనేది ఓ బ్యూటిఫుల్ ప్రోమోతో రివీల్ చేశారు. యువ నటి ఆఫీయా సయ్యద్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ ఆమెనే తన రుక్మిణి అంటూ నితిన్ రివీల్ చేసాడు. తన భార్య రుక్మిణి ఆమె చాలా స్ట్రిక్ట్ అండోయ్ అంటూ ఫన్ తో ఆమెని పరిచయం చేసిన గ్లింప్స్ ఇపుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా ఈ డిసెంబర్ 4న సినిమా విడుదల కాబోతుంది.
Meet my wife RUKMINI..
Chaala strict andoiii 🔥
#AliasRukmini In cinemas worldwide December 4th ❤️
Written & Directed by @Afilmby_Murali
#AliasRukminiOnDec4th
@NameisNani @UnanimousProds @DeepthiGanta1 @VijaiBulganin https://t.co/boq1zgenaA— nithiin (@actor_nithiin) October 13, 2026


