నాని “అంటే సుందరానికి” నుండి ఎంత చిత్రం లిరికల్ వీడియో రిలీజ్!

Published on May 9, 2022 7:57 pm IST

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక ఆత్రేయ రచన, దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం అంటే సుందరానికి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ను జూన్ 10, 2022 న థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది చిత్ర యూనిట్.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుండి ఎంత చిత్రం లిరికల్ వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాని మరియు హీరోయిన్ నజ్రియా ల జోడీ చాలా బాగుంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి, కీర్తన వైద్యనాదన్ లు పాడటం జరిగింది. నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :