అందరికీ చిన్నపాటి షాక్ ఇచ్చిన బోయపాటి శ్రీను !
Published on Jul 12, 2017 1:41 pm IST


యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకునే స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘జయ జానకి నాయక’. బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ లు జంటగా నటించిన ఈ చిత్రం యొక్క టీజర్ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. సాధారణంగా బోయపాటి సినిమాలంటే మిగతా అంశాలు ఎలా ఉన్నా యాక్షన్ మాత్రం తారా స్థాయిలో ఉంటుంది. అందుకే ప్రేక్షకులు ఈ టీజర్ కూడా మాంచి ఎలివేషన్ ఫ్రేమ్స్ తో ఉంటుందని అనుకున్నారు.

కానీ విచిత్రంగా బోయపాటి మాత్రం టీజర్ ను చాలా కూల్ గా, హీరో హీరోయిన్ల మధ్యన నడిచే రొమాంటిక్ ట్రాక్ ను హైలెట్ చేస్తూ ప్రెజెంట్ చేశారు. దీంతో అందరూ బోయపాటి కేవలం టీజర్లో మాత్రమే యాక్షన్ ను తగ్గించి, లవ్ ట్రాక్ ను హైలెట్ చేశారా లేకపోతే సినిమాలో కూడా అలానే చేశారా, ఒకవేళ అలానే చేసుంటే రొమాంటిక్ ట్రాక్ ను ఎలా హ్యాండిల్ చేసుంటారో తప్పకుండా చూడాల్సిందే అనుకుంటున్నారు. మొత్తం మీద బోయపాటి స్టైల్ మార్చి టీజర్ తోనే సినిమాకు కావాల్సినంత హైప్ తెచ్చిపెట్టారు. ఇకపోతే దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 11న విడుదల చేయనున్నారు.

టీజర్ కొరకు క్లిక్ చేయండి

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook