ఇంటర్వ్యూ : అజయ్- నాకు తగ్గ పాత్రలు రావడం లేదు!
Published on Nov 18, 2017 6:26 pm IST

ఎన్నో విభిన్నమైన పాత్రలతో మెప్పించిన అజయ్ తాజాగా నారా రోహిత్ నటించిన ‘బాలకృష్ణుడు’ సినిమాలో ఫ్యాక్సన్ లీడర్ పాత్రలో నటించాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి అజయ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ…

బాలకృష్ణుడు సినిమా గురించి చెప్పండి?

మోదటిసారిగా ఫుల్ లెన్త్ ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో ప్రతాప్ రెడ్డిగా ఈ సినిమాలో కనిపించబోతున్నా. రమ్యకృష్ణ గారితో నటించడం ఆనందంగా ఉంది. ఆమెకు పూర్తి నెగిటివ్ క్యారెక్టర్ లో నటించాను.

ఈ సినిమా ఎలా ఉండబోతుంది ?

ఇది మాస్ ఎంటర్టైనర్ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. పృద్వి, శ్రీనివాస్ రెడ్డి కామెడీ బాగుంటుంది. చాలా రోజుల తరువాత మంచి ఫ్యాక్షన్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. నారా రోహిత్ క్యారెక్టరైజేషన్ బాగుంటుంది.

నారా రోహిత్ తో వర్క్ చేయడం గురించి ?

నాకు రోహిత్ మంచి ఫ్రెండ్ ‘రౌడీ ఫెలో’ సినిమా నుండి మాకు మంచి సన్నిహిత్యం ఉంది. రియల్ లైఫ్ లో మంచి స్నేహితులం అవ్వడంతో నటించే సమయంలో ఇంకా ఈజీగా ఈ సినిమా షూటింగ్ చేసాం. పృథ్వి తో రోహిత్ చేసిన కామెడీ సినిమాకు హైలైట్.

మీరు ప్రధాన పాత్రల్లో సినిమాలు చెయ్యడం లేదు ఎందుకు ?

కెరీర్ ప్రారంభంలో రెండు సినిమాల్లో నటించాను. విలన్ గా చేస్తున్న సమయంలో హీరోగా చేయమని అడిగారు కాదనలేకపోయాను. హీరోగా మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకోలేకపోయానని నా అభిప్రాయం.ప్రస్తుతం తెలుగులో నాకు తగ్గ పాత్రలు రావడం లేదు!

మీ తమిళ్ సినిమాకు గురించి ?

త్వరలో తమిల్ లో వరుసగా సినిమాలు చేస్తాను. కొంతమంది దర్శకులు కథలు చెప్పారు. విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా చెయ్యబోతున్న. ఆ సినిమాలో నాది ఫుల్ లెన్త్ విలన్ క్యారెక్టర్.

మీ తదుపరి సినిమాలు ?

బాలకృష్ణుడు విడుదల కానుంది ఆ సినిమా తరువాత అఖిల్ హలో, మహేష్ బాబు ‘భరత్ అను నేను’ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాను.

 
Like us on Facebook