‘ఎఫ్ 2’కి ఇంక సాంగ్ ఒక్కటే మిగిలింది !

Published on Dec 5, 2018 10:01 pm IST

విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కలయికలో వస్తోన్న మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఒక్క పాట మినహా మిగతా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుందని చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా తెలిపారు.

కాగా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని పూర్తి హాస్యభరితంగా చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేశ్ జోడిగా తమన్నా.. వరుణ్ తేజ్ జోడిగా మెహరీన్ నటిస్తున్నారు. ఓ కీలక పాత్రలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ కనిపించనున్నారు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందింస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :