ఆకట్టుకుంటున్న ‘ఫలక్ నుమా దాస్’ టీజర్ !

Published on Feb 14, 2019 3:51 am IST

మొదట నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం దర్శకుడిగా మారాడు యంగ్ హీరో విశ్వక్‌సేన్‌. విశ్వక్ సేన్ దర్శకత్వంలో ‘ఫలక్ నుమా దాస్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

ప్రస్తుతం టీజర్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటుంది. అయితే టీజర్ లో బూతు పదాలు మరీ ఎక్కువుగా ఉన్నాయని కొంతమంది పెదవి విరుస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే కొన్ని దారుణమైన బూతులను డైరెక్ట్ గానే పలికించారు.

కాగా హైదారాబాద్ ఓల్డ్ సిటీలోని ఫలక్ నుమా, లాల్ దర్వాజా వంటి ప్రాంతాల్లో రూపొందించిన ఈ చిత్రంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తోన్న యంగ్ హీరో విశ్వక్‌సేన్‌ కు గతంలో షార్ట్‌ ఫిలింస్‌ ను తీసిన అనుభవం ఉంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :