ఆకట్టుకుంటున్న సుహస్ “ఫ్యామిలీ డ్రామా” ట్రైలర్!

Published on Jul 22, 2021 4:02 pm IST

మెహెర్ తేజ్ దర్శకత్వం లో సుహస్, తేజ కాసరపు, పూజ కిరణ్, అనూష నూతుల, శృతి మెహర్ మరియు సంజయ్ రత లు ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ డ్రామా ట్రైలర్ తాజాగా విడుదల అయింది. అయితే విడుదల అయిన కొద్ది సేపటికే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుహస్ నటన తో ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరం గా సాగింది. ఈ చిత్రం లో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఫ్యామిలీ డ్రామా పేరుతో వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రామ్ వీరపనేని సమర్పణ లో చష్మ ఫిలిమ్స్, నూతన భారతి ఫిల్మ్స్, మాంగో మాస్ మీడియా పతాకాల పై ఈ చిత్రం ను నిర్మిస్తున్నారు. అజయ్ సంజయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం ట్రైలర్ విడుదల అవ్వడం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :