రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ పై అందరిలో క్యూరియాసిటీ ?

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ పై అందరిలో క్యూరియాసిటీ ?

Published on Nov 2, 2022 3:00 AM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అంజలి, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని ఎంతో భారీ వ్యయంతో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్ 15వ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది.

అయితే విషయం ఏమిటంటే, దీని తరువాత రామ్ చరణ్ నటించనున్న 16 వ సినిమా వాస్తవానికి యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేయాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఆ ప్రాజక్ట్ ఆగిపోవడంతో తదుపరి ఏ దర్శకుడితో తమ హీరో వర్క్ చేస్తారు అనే దానిపై రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎంతో క్యూరియాసిటీ నెలకొని ఉంది. మరోవైపు రామ్ చరణ్ తో మూవీ చేసేందుకు ఇప్పటికే పలువురు యువ దర్శకులు రెడీ అవుతుండడంతో నెక్స్ట్ వారిలో ఎవరికి ఆయన ఛాన్స్ ఇస్తారు అనేది పక్కాగా తెలియాలి అంటే మాత్రం మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు