అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపిన మహేష్ !
Published on May 29, 2017 8:37 am IST


‘బ్రహ్మోత్సవం’ పరాజయం తర్వాత మహేష్ ఎలాంటి సినిమా చేస్తాడో అని ఉత్కంఠగా ఎదురుచూసిన అభిమానులకు మురుగదాస్ తో ‘స్పైడర్’ ప్రాజెక్టును ప్రకటించి పండుగలాంటి వార్తనిచ్చాడు మహేష్ బాబు. కానీ మొదటి నుండి సినిమా తాలూకు టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, రిలీజ్ డేట్ వంటి విషయాల్లో జాప్యం చేసి ప్రతిసారి ఫ్యాన్స్ ను కాస్త నిరుత్సాహానికి గురిచేశారు. ఆ నిరుత్సాహాలన్నీ తొలగిపోయేలా టీజర్ రిలీజ్, సినిమా విడుదల తేదీలను అనౌన్స్ చేశాడు ప్రిన్స్.

మే 31వ తేదీ తన తడ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో ఆరోజు సాయంత్రం 5 గంటలకు టీజర్ ను రిలీజ్ చేస్తామని అలాగే సినిమాను దసరా నాటికి విడుదల చేస్తామని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మహేష్ వేసిన ఈ ట్వీట్లతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మరి ఫస్ట్ లుక్ తోనే యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను నెలకొల్పిన ‘స్పైడర్’ టీజర్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook