సక్సెస్ ను ప్రేక్షకులతో పంచుకోనున్న ‘ఫిదా’ టీమ్ !


ఈ సంవత్సరం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో వరుణ్ తేజ్ – శేఖర్ కమ్ములల ‘ఫిదా’ కూడా ఒకటి. ఊహించని రీతిలో కలెక్షన్లు సాధిస్తూ ఇప్పటికీ పలు చోట్ల విజయవంతంగా రన్ అవుతున్న ఈ చిత్రం తాజాగా యూఎస్ లో 2 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి 2 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన 7వ తెలుగు సినిమాగా నిలిచింది. ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులతోనే దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించింది టీమ్.

అందుకే కొన్ని రోజులుగా అనుకుంటున్న సక్సెస్ సంబరాల్ని ఈరోజు సాయంత్రం తెలంగాణాలోని నిజామాబాద్ లోని కలెక్టర్ గ్రౌండ్స్ లో నిర్వహించనుంది. దీంతోపాటు అభిమానులు పెద్ద ఎత్తున మెగా ర్యాలీని నిర్వహించనున్నారు. ఇప్పటికే తెలంగాణా ప్రేక్షకుల్లకు బాగా దగ్గరైన ఈ సినిమా ఈ సంబరాలతో మరింత దగ్గరకానుంది. దీంతో సినిమా రన్ ఇంకాస్త మెరుగ్గా జరిగే అవకాశముంది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు అసలు రాబట్టుకుని లాభాల్ని ఆర్జిస్తున్నారు.