పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేస్తున్న రెండో చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ ఇద్దరికీ ఇదే తెలుగులో మొదటి సినిమా కాగా ఈ సినిమాతోనే వారు టాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నారు.
అయితే ఈ సినిమా విషయంలో మంచి కేజ్రీగా ఉన్న కొన్ని అంశాల్లో అనిరుద్ సంగీతం కూడా ఒకటి. ఇప్పుడు అనిరుద్ (Anirudh) ఉన్న ఫామ్ లో ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి ఓ సాంగ్ పడితే వినాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. అలా దేవర మొదటి పాటపై మంచి హైప్ నెలకొనగా ఇప్పుడు దీనిపై ఫైనల్ గా చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా అప్డేట్ వచ్చింది.
మరి ఈ సాంగ్ ని అతి త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్టుగా హింట్ ఇస్తూ ప్రకటించారు. దీనితో అసలు దేవర నుంచి మొదటి సాంగ్ ఉందా లేదా అని అనుకుంటున్నా వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. మరి ఈ మే 20న తారక్ పుట్టినరోజు కానుకగా వస్తుంది అని బజ్ ఉంది. మరి ఈ డేట్ నే మేకర్స్ తర్వాత అప్డేట్ లో ప్రకటిస్తారా లేదో వేచి చూడాలి.
On the way!! On the way!! ????????????????#DevaraFirstSingle #Devara
— Devara (@DevaraMovie) May 9, 2024