చరణ్ సినిమాకి ఫ్యాన్ స్టఫ్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్న శంకర్.!

Published on Jul 18, 2021 8:51 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి తో “రౌద్రం రణం రుధిరం” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దాని తర్వాత ఎలాంటి సినిమా సెట్ చేస్తాడా అనుకున్న సమయంలో మరో సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో ప్లాన్ చెయ్యడంతో చరణ్ లైనప్ ఇంకో స్థాయికి వెళ్ళింది. మరి దీనికి గాను శంకర్ కూడా సాలిడ్ గా ప్లాన్ చేస్తున్నట్టు అర్ధం అవుతుంది.

మొన్ననే స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ని తీసుకోగా నిన్ననే చరణ్ అండ్ అతని అభిమానుల ఫేవరెట్ డాన్స్ మాస్టర్ జానీ ని ఈ సినిమాకి ప్రధాన డాన్స్ మాస్టర్ గా ఎంచుకోవడం ఆసక్తిగా మారింది. దీనిని బట్టి శంకర్ అన్ని ఎలిమెంట్స్ తో పాటుగా ఫాన్స్ స్టఫ్ పరంగా కూడా ఎంత పర్టిక్యులర్ గా ప్లాన్ చేస్తున్నారని అర్ధం అవుతుంది. మరి వీటన్నిటికీ తోడు వింటేజ్ శంకర్ లా సాలిడ్ స్క్రిప్ట్ కానీ పడితే బాక్సాఫీస్ రికార్డులు అన్నీ బద్దలే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :