మొదటిసారి ఆ ఘనతను దక్కించుకున్న రవితేజ !
Published on Oct 30, 2017 4:31 pm IST


మాస్ మహారాజ రవితేజ తాజా చిత్రం ‘రాజా ది గ్రేట్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎన్నాళ్లగానో రవితేజ్ కోరుకుంటున్న కమర్షియల్ హిట్ దక్కినట్లైంది. అంతేగాక ఈ చిత్రంతో మరో ఘనతనకు కూడా దక్కించుకున్నాడు రవితేజ. అదేమిటంటే ‘రాజా ది గ్రేట్’ చిత్రం నైజాం ఏరియాలో రూ. 10 కోట్ల షేర్ ను అందుకుంది.

రవితేజ సినిమా నైజాం లో ఇంత పెద్ద షేర్ వసూలు చేయడం ఇదే మొదటిసారి. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి చిత్రం రూ.25 కోట్లకు పైగానే షేర్ ను ఖాతాలో వేసుకుని డిస్ట్రిబ్యూటర్లకు లాభదాయకంగా నిలిచింది. ఇకపోతే ప్రస్తుతం విక్రమ్ సిరికొండ డైరెక్షన్లో ‘టచ్ చేసి చూడు’ సినిమా చేస్తున్న రవితేజ ‘భోగన్’ తమిళ రీమేక్ తో పాటు శ్రీనువైట్ల డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నారు.

 
Like us on Facebook