‘గ్యాంగ్’ కృష్ణా ఏరియా కలెక్షన్స్ !
Published on Jan 13, 2018 4:41 pm IST

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘తాన సెరెంద కూట్టం’ చిత్రం తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో నిన్ననే విడుదలైంది. భారీ చిత్రం ‘జై సింహా’ తో పోటీకి దిగిన ఈ చిత్రం సూర్యకు ఉన్న క్రేజ్ మూలాన చెప్పుకోదగిన ఓపెనింగ్స్ నే రాబట్టుకుంది. అలాగే ప్రేక్షకులు, విమర్శకుల నుండి కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

కృష్ణా జిల్లాలో ఈ చిత్రం మొదటిరోజు రూ.5.56 లక్షల షేర్ ను అందుకుంది. ఇక పాజిటివ్ మౌత్ టాక్ ఎలాగూ ఉంది కాబట్టి రాబోయే సంక్రాంతి సెలవులు సినిమాకు మరింతగా కలిసొచ్చే అవకాశముంది. తమిళనాట కూడా ఈ సినిమాకు భారీస్థాయి ఓపెనింగ్స్ లభించాయి. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

 
Like us on Facebook