నైజాంలో దుమ్మురేపే కలెక్షన్లను రాబడుతున్న ‘గరుడవేగ’ !
Published on Nov 20, 2017 8:49 am IST

సీనియర్ హీరో డా.రాజశేఖర్ నటించిన ‘పిఎస్వి గరుడవేగ’ చిత్రం విడుదలైన ప్రతి చోట హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ నెల 3న విడుదలైన ఈ చిత్రం రాజశేఖర్ కు మంచి కమ్ బ్యాక్ ను అందించింది. ఈ సినిమాలో రాజశేఖర్ ఎన్.ఐ.ఏ అధికారిగా నటించిన తీరు ప్రవీణ్ సత్తారు దర్శకత్వ విధానం చిత్రాన్ని విజయం దిశగా నడిపిస్తున్నాయి. నిర్మాణ సంస్థ లెక్కల ప్రకారం ఈ సినిమా నైజాం ఏరియాలో ఇప్పటి వరకు రూ.2 కోట్ల షేర్ ను రాబట్టినట్టు తెలుస్తోంది.

అంతేగాక ఫుల్ రన్లో ఈ మొత్తం రూ.2.5 కోట్ల వరకు వెళ్లొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు రాజశేఖర్ కెరీర్లో నైజాం ఏరియాకు గాను ఇవే ఉత్తమమైన కలెక్షన్లు కావడం విశేషం. ఈ చిత్ర విజయంతో రాజశేఖర్ తో పాటు దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు కూడా మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.

 
Like us on Facebook