రాజ్ తరుణ్ పక్కన ఆ యువ హీరోయిన్ ఫిక్స్ !
Published on Oct 23, 2017 7:30 pm IST

యువ హీరో రాజ్ తరుణ్, దిల్ రాజు కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘లవర్’ టైటిల్ ఫిక్స్ చేసారు, రేపు (మంగళవారం) ప్రారంభం కానుంది, ఈ సినిమాకి దర్శకుడిగా అనిష్ కృష్ణ అనే యువ దర్శకుడు దర్శకుడి గా వ్యవహరించనున్నాడు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకేక్కబోతునట్లు సమాచారం.

ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన గాయత్రి సురేష్ నటించబోతుంది. ఈ హీరోయిన్ మలయాళంలో ఆరు చిత్రాల్లో నటించింది, ప్రస్తుతం తమిళ్ లో జి.వి ప్రకాష్ సినిమాలో నటిస్తుంది. మొదటి సినిమానే దిల్ రాజు బ్యానర్ లో నటించే ఛాన్స్ వచ్చిందంటే అదృష్టమనే చెప్పాలి, ఈ చిత్ర దర్శకుడు అనీష్ కృష్ణ గతంలో ‘అలా ఎలా’ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

 
Like us on Facebook