గీత గోవిందం ఎంత రాబట్టిందంటే !

Published on Oct 7, 2018 5:46 pm IST

విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ ఇటీవల విడుదలై 100కోట్లకు ఫై చిలుకు గ్రాస్ వసూళ్లతో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇన్ని రోజులు బాక్సాఫీస్ వద్ద హావ కొనసాగించిన ఈ చిత్రం ఎట్టకేలకు నెమ్మదించింది. ఇక ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 68కోట్ల షేర్ ను రాబట్టింది. ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ 18కోట్ల కు జరుగుగా అంతకు 3రెట్లు వసూళ్లను సాధించి బయ్యర్లకు, నిర్మాతకు ఊహించని లాభాలను అందించింది. ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ చిత్రం గా నిలిచింది ఈ చిత్రం.

పరుశురాం తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా రష్మిక నటించింది. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు ఈచిత్రాన్ని నిర్మించగా గోపిసుందర్ సంగీతం అందిచారు.

సంబంధిత సమాచారం :