మే 5న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ‘గీతా సుబ్రహ్మణ్యం – 3’

మే 5న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ‘గీతా సుబ్రహ్మణ్యం – 3’

Published on Apr 19, 2023 9:02 PM IST


ప్రముఖ ఓటిటి మాధ్యమాల్లో ఒకటైన ఆహాలో ఇటీవల అందరినీ మెప్పించే మంచి కంటెంట్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక యూత్‌కు ఇష్టమైన ప్రేమ అనే అంశం మీద ఎక్కువగా ఆహా ఫోకస్ పెడుతుంటుంది. లోకల్ కంటెంట్‌ను ఎక్కువగా ప్రోత్సహించే క్రమంలో ఇప్పుడు గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్‌కు తీసుకురాబోతోన్నారు ఆహా వారు. కాగా సమ్మర్ కానుకగా మే 5న ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక గీతా సుబ్రహ్మణ్యం ఇప్పటికే రెండు సీజన్లు ప్రసారం అయి ఆడియన్స్ ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రేమ కథలో రంగా సుబ్రహ్మణ్యంగా సుప్రజ్ కనిపించగా గీతగా అభిజ్ఞ్య ఉతలూరు కనిపించారు.

ప్రేమలో ఉండే చిన్న పాటి సరదా గొడవలు ఎంతో ఫన్నీగా ఇందులో చూపించారు. కాగా తాజా 3వ సీజన్ ఎనిమిది ఎపిసోడ్‌లతో గీతాసుబ్రహ్మణ్యం అందరినీ మెప్పించేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ మూడో సీజన్ గీతా, సుబ్బుల మధ్య నడుస్తుంది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ బిజీ లైఫ్‌ను గడుపుతుంటారు. ఒక ప్రాజెక్ట్ కోసం ఈ ఇద్దరినీ ఎంపిక చేయడం, అందులో ఉద్యోగులు ఎలాంటి రిలేషన్ షిప్‌లో ఉండకూడదని కండీషన్ ఉండడం జరుగుతుంది. కానీ ఆ కండీషన్‌ను గీతా, సుబ్బులు బ్రేక్ చేసి ప్రేమలో పడతారు. అలానే వారి ఫీలింగ్స్‌ను మిగతా ఉద్యోగుల ముందు బయట పెట్టకుండా మ్యానేజ్ చేస్తుంటారు. ఇక ఈ వెబ్ సిరీస్‌ను టమడ మీడియా గ్రాండ్ గా నిర్మిస్తోండగా దీనికి శివ సాయి వర్దన్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ సిరీస్ అయిన గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్‌ మే 5న ఆహాలో తప్పకుండా ఆడియన్స్ ని అలరిస్తుందనే ఆశాభవాన్ని వ్యక్తం చేస్తోంది యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు