వరుణ్ “గని” సెన్సార్ కార్యక్రమాలు పూర్తి…ప్రీ రిలీజ్ వేడుక కి సర్వం సిద్దం

వరుణ్ “గని” సెన్సార్ కార్యక్రమాలు పూర్తి…ప్రీ రిలీజ్ వేడుక కి సర్వం సిద్దం

Published on Apr 1, 2022 8:30 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, రినైస్సన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలకు, ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఏప్రిల్ 2న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ప్రమోషనల్ కార్యక్రమాలలో మరింత జోరు పెంచనున్నారు దర్శక నిర్మాతలు. విడుదల ముందు వరకు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా వినూత్నమైన ప్రచారం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.

సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కి నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ముద్ద, సినిమాటోగ్రపీ జార్జ్ సి విలియమ్స్, ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్, సంగీతం థమన్, పిఆర్ఓ వంశీ కాక, ఏలూరు శ్రీను లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు