మిలియన్ మార్కును అవలీలగా ఛేదించిన మహేష్ !
Published on Jun 1, 2017 4:49 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పైడర్’. అనౌన్స్మెంట్ రోజు నుండే భారీ స్థాయి అంచనాల్ని మూటగట్టుకున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయే కొద్ది ప్రేక్షకుల్లో ఆసక్తిని ఇంకా పెంచుతూ వస్తోంది. ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ కు విశేష స్పందన దక్కగా గ్లింప్స్ ఆఫ్ స్పైడర్ పేరుతో ఈరోజు విడుదలైన వీడియోకు విపరీతమైన ఆదరణ దక్కింది.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాల టీజర్లకు పూర్తి భిన్నంగా సాంకేతికత, స్టైలిష్ మేకింగ్ ప్రధానంగా ఈ వీడియోని రూపొందించారు మురుగదాస్. అందుకే ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులు, సెలబ్రిటీలు ఈ వీడియోకు ఫిదా అయ్యారు. అంతేగాక సోషల్ మీడియా ట్రెండింగ్స్ లో టాప్ పొజిషన్లో నిలబడ్డ ఈ వీడియో యూట్యూబ్ లో 5 గంటల్లోనే మిలియన్ మార్కును దాటేసి ప్రస్తుతం 1.48 మిలియన్ వద్ద ఉంది. అంతేగాక ఈ వీడియో 1.25 లక్షల లైక్స్ ను కూడా సొంతం చేసుకుంది.

స్పైడర్ గ్లింప్స్ వీడియో కొరకు క్లిక్ చేయండి:

 
Like us on Facebook