ప్రేక్షకులకు “గాడ్సే” మూవీ టీం ఛాలెంజ్.. ఏం చేయాలంటే?

Published on Jun 11, 2022 8:30 pm IST

విభిన్న కథా చిత్రాలతో అలరించే యంగ్ హీరో సత్యదేవ్, గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “గాడ్సే”. సికే స్క్రీన్స్ బ్యానర్‌పై సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 17వ తేదీన విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని నెలకొల్పింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ఓ ఛాలెంజ్ విసిరింది. గాడ్సే చిత్రంలో సత్యదేవ్ చెప్పే ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌ను పోస్ట్ చేసి ఈ డైలాగ్‌ను రీల్ లేదా రీమిక్స్ చేసి #GODSECHALLENGE పేరిట సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలని, అందులో బెస్ట్ రీల్స్‌ని ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు స్క్రీన్‌పై వేస్తామని అంతేకాకుండా గాడ్సే టీంను కలిసే ఛాన్స్ కల్పిస్తామని తెలిపారు. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పవర్‌ఫుల్ డైలాగ్ రీల్ ఓ సారి ట్రై చేయండి. ఇదిలా ఉంటే ఐశ్వర్య లక్ష్మి, జియా శర్మ, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, నాగబాబు, సిజ్జు మీనన్, పృథ్వీ రాజ్, నోయెల్ సీన్, ప్రియదర్శి, చైతన్య కృష్ణ, పవన్ సంతోష్, గురు చరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి శాండీ అద్దంకి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :