మ్యాడ్ మూవీ కి బుల్లితెర పై సూపర్ రెస్పాన్స్!

మ్యాడ్ మూవీ కి బుల్లితెర పై సూపర్ రెస్పాన్స్!

Published on Jan 26, 2024 9:06 PM IST

సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉదయన్ ప్రధాన పాత్రల్లో, యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ లో ప్రసారం అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రానికి బుల్లితెర పై సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 4.70 టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేసుకుంది ఈ సినిమా. ఇది మంచి రెస్పాన్స్ అని చెప్పాలి. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు