వరుణ్ తేజ్ “పవర్ ఆఫ్ గని” కి విశేష స్పందన!

వరుణ్ తేజ్ “పవర్ ఆఫ్ గని” కి విశేష స్పందన!

Published on Jan 20, 2022 8:02 PM IST

వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం నుండి పవర్ ఆఫ్ గని అంటూ వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో కు సోషల్ మీడియా లో విశేష స్పందన లభిస్తోంది. అంతేకాక యూ ట్యూబ్ లో సైతం ట్రెండ్ అవుతోంది. 1.1 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. అల్లు అరవింద్ సమర్పణ లో అల్లు బాబీ కంపనీ మరియు రినైస్సన్స్ పిక్చర్స్ పై ఈ చిత్రాన్ని సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు