‘ఆక్సిజన్’ సినిమా తరువాత గోపీచంద్ కథానాయకుడిగా నటించనున్న కొత్త సినిమాకు ‘పంతం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. చక్రి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను రాధామోహన్ నిర్మిస్తున్నాడు. గోపిసుందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ నిన్న హైదరాబాద్ లో పూర్తయ్యింది. ఇంటర్వెల్ ఎపిసోడ్స్ చిత్రీకరించిన యూనిట్ ఫిబ్రవరి 5 నుండి రెండో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.
మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను ఈ ఏడాది మే 18 న విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయని సమాచారం. స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తోన్న ఈ సినిమా గోపీచంద్ కు 25 వ సినిమా అవ్వడం విశేషం.


