ఆరేళ్ళ పాపకు మానవ హక్కులు లేవా.. హరీష్ శంకర్ క్వశన్..!

ఆరేళ్ళ పాపకు మానవ హక్కులు లేవా.. హరీష్ శంకర్ క్వశన్..!

Published on Sep 18, 2021 2:06 AM IST


హైదరాబాద్ సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం చేసి హత్య చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని రేపింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే నిందితుడు స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. అయితే నిందితుడి మృతిపై పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నిందితుడిది కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పిటీషన్‌లో పేర్కొన్నారు.

అయితే దీనిపై దర్శకుడు హరీశ్ శంకర్ ఘాటుగా స్పందించారు. ‘ఆరేళ్ళ పాపకు మానవహక్కులు లేవా? కేవలం రేపిస్టులు మాత్రమే పౌరులా? అంటూ మృగాల కోసం… మానవ హక్కుల సంఘం పనిచేస్తుందా అని ప్రశ్నించారు. అయితే హరీశ్ ట్వీట్‌ను నెటిజన్లు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆరేళ్ల పాపపై హత్యాచారం చేసి హత్య చేసినప్పుడు మానవ హక్కుల సంఘం ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు