తెలంగాణ ఎన్నికల ఫలితాలఫై హరీష్ శంకర్ పంచ్ డైలాగ్ !

Published on Dec 11, 2018 12:18 pm IST

దేశవ్యాప్తంగా ఆసక్తిని క్రియేట్ చేసిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలుబడనున్నాయి. ఇక ఇప్పటికే ప్రారంభమైన కౌంటింగ్ లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆ పార్టీ 7 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేయగా 83 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. దాంతో తెలంగాణ ప్రజలు మరోసారి టీఆర్ఎస్ పార్టీ కే పట్టం కట్టడం ఖాయం గా కనిపిస్తుంది. ఇక తాజాగా ఈ ఫలితాల ఫై ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తన దైన స్టయిల్లో స్పందించారు.

ఫామ్ హౌస్ లో వున్నారో.. ఫామ్ లో వున్నారో తేల్చి చెప్పేసిన జనం అని పవర్ అఫ్ డెమోక్రసి అంటే ఇదే అని కేటీఆర్ , కవిత కు శుభాకాంక్షలు తెలియజేస్తూ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు.

సంబంధిత సమాచారం :