హర్ష చెముడు ‘సుందరం మాస్టర్’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ ?

హర్ష చెముడు ‘సుందరం మాస్టర్’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ ?

Published on Mar 19, 2024 9:30 AM IST

కమెడియన్ హర్ష చెముడు తాజాగా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ సుందరం మాస్టర్. ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయిన సుందరం మాస్టర్ మంచి విజయం అందుకుంది.

ఈ మూవీలో తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో అందరినీ అలరించారు హర్ష చెముడు. నూతన దర్శకుడు కళ్యాణ్ సంతోష్ తెరకెక్కించిన ఈ మూవీని రవితేజ, సుధీర్ కుమార్ కుర్ర కలిసి ఆర్టి టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా సంస్థల పై నిర్మించారు.

విషయం ఏమిటంటే, ఈ మూవీ మార్చి 22న ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ఈటివి విన్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అతి త్వరలో వారి నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రానుంది. మరి సుందరం మాస్టర్ ఎంతవరకు ఓటిటి ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు