నవంబర్ 3న హేబా పటేల్ కొత్త సినిమా రిలీజ్!
Published on Oct 4, 2017 3:22 pm IST


హేబా పటేల్ ప్రధాన పాత్రలో నాగ్ అన్వేష్ హీరోగా బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఏంజెల్. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్, గ్రాఫిక్స్ వర్క్స్ జరుపుకొని నవంబర్ 3న రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి అందరిని ఆకట్టుకుంది. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ సినిమాలో ప్రధాన విలన్ గా జిల్ ఫేం కబీర్ సింగ్ నటిస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని ఎ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

 
Like us on Facebook