మళ్ళి ఆ హీరోయిన్ నే నమ్ముకుంటున్న రాజ్ తరుణ్ !
Published on Jun 10, 2018 5:47 pm IST

వరుస పరాజయాలతో కెరీర్ ను ప్రశ్నార్ధకం లో పడేసుకున్న యువ హీరో రాజ్ తరుణ్ . ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్న ఈ కథానాయకుడు ఈ మధ్య సరైన హిట్లు లేక డీలా పడ్డాడు . ఇటీవల రాజ్ రాజుగాడు గా ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా విజయం సాధించలేకపోయింది .

ఇప్పుడు ఎలాగైనా విజయం సాధించాలని తమిళ రీమేక్ ను నమ్ముకున్నాడు రాజ్ . విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి , నయన తార జంటగా తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాని తెలుగులో రాజ్ తరుణ్ హీరో గా రీమేక్ చేస్తున్నారు . నిర్మాత సి . కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .
ఈ సినిమాలో రాజ్ తరుణ్ కి జోడిగా హెబ్బా పటేల్ నటించనుంది . ఇంతకు ముందు వీరిద్దరూ కలిసి కుమారి 21ఎఫ్ , ఈడో రకం ఆడో రకం , అందగాడు చిత్రాలలో నటించారు.వీటిలో అందగాడు తప్ప మిగితా రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook