మల్టిస్టారర్ సినిమా అని కన్ఫాం చేసిన హీరో !
Published on Nov 28, 2017 8:39 am IST

భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ఈ మద్య ఆయన చరణ్ ఎన్టీఆర్ తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో రకరకాల ఉహగానాలు వినిపించాయి. రాజమౌళి నెక్స్ట్ సినిమా రామ్ చరణ్, ఎన్టీఆర్ తో ముల్టీస్టారర్ ప్రాజెక్ట్ చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సాయి ధరమ్ తేజ్ జవాన్ ఇంటర్వ్యూ లో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడం జరిగింది.

“ముందు అది చూసి, వాళ్లు ముగ్గురూ కలిసినప్పుడు సరదాగా తీసుకున్న ఫొటో అనుకున్నాడంట సాయి. అయితే ఆ తరువాత తన ఫ్రెండ్ కాల్ చేసి రాజమౌళి పోస్ట్ చేసిన ఫోటో చూసావా అని అడిగితే.. చూసాను అది ఒక ఫంక్షన్ లో దిగింది అని చెప్పను. అప్పుడు వాడు లేదు వాళ్ళు ముగ్గురు కలిసి సినిమా చెయ్యబోతున్నారని చెప్పడంతో కాల్ చేసి కనుకున్నాను ఆ వార్త నిజమేనని తెలుసుకున్నానని తెలియజేసాడు సాయి ధరమ్ తేజ్.

 
Like us on Facebook