జూలై 7 ప్రేక్షకుల ముందుకు రానున్న నాని చిత్రం నిన్ను కోరి.!
Published on Jun 10, 2017 7:00 pm IST


డివివి దానయ్య నిర్మాణ సారధ్యంలో నాని, నివేదితా థామస్ హీరో హీరోయిన్లు గా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్నా చిత్రం నిన్ను కోరి. ఇప్పటికే ఈ చిత్రం టీజర్, ప్రమోషన్ సాంగ్ రిలీజ్ అయ్యి తెలుగు సినిమా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసారు.. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాని జులై 7 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఓ రిలీజ్ డేట్ పోస్టర్ కూడా విడుదల చేసారు. వరుస హిట్ ల తో దూసుకుపోతున్న నానికి కెరియర్ కి ఈ సినిమా కూడా కాస్త ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫీల్ గుడ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి మరో కీలకమైన పాత్ర చేసారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులకి ఎంత వరకు చేరువ అవుతుందో వేచి చూడాలి.

 
Like us on Facebook