లక్ష రీల్స్ తో “పుష్ప పుష్ప” వరల్డ్ వైడ్ సెన్సేషన్!

లక్ష రీల్స్ తో “పుష్ప పుష్ప” వరల్డ్ వైడ్ సెన్సేషన్!

Published on May 4, 2024 11:45 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మేకర్స్ ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ను భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాట 50 మిలియన్స్ కు పైగా వ్యూస్ ను రాబట్టడం జరిగింది. ఈ పాట లో బన్నీ వేసిన స్టెప్స్ కి ఆడియెన్స్ ఫిదా అయిపోయారు.

వరల్డ్ వైడ్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఈ పాటకి లక్ష కి పైగా రీల్స్ వచ్చాయి. ఈ పాటకి తమదైన శైలి లో స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. కేవలం ఫస్ట్ సింగిల్ తోనే ఈ రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. ఫాహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానున్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు