కన్నీటి పర్యంతమైన స్టార్ హీరో !
Published on Oct 28, 2017 11:48 am IST


యాంగ్రీ యాంగ్ మాన్ గా గుర్తింపు తెచ్చుకున్న డా. రాజశేఖర్ హీరోగా , చందమామ కథలు , గుంటూరు టాకీస్ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పిఎస్‌వి గరుడవేగ 126.18 ఎమ్‌’. నవంబర్ 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిన్న (శుక్రవారం) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది, సన్నీ లియోన్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ ఫంక్షన్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు, తన తల్లిని తలుచుకొని భాద పడ్డారు, ఈ మద్య కాలంలో రాజశేఖర్ తల్లి స్వర్గాస్తులైన సంగతి తెలిసింది. తనకు సినిమా పిచ్చి అని అందువల్లే మెడిసిన్ పూర్తి చేసినా సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. సినిమాను తప్పకుండ థియేటర్సలో చూడమని కోరుకున్నారు.

 
Like us on Facebook