Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
ఇంటర్వ్యూ : రవితేజ – నాకు బెస్ట్ క్రిటిక్ నా కొడుకే !
Published on Nov 14, 2018 1:10 pm IST

శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. కాగా ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటించగా.. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం నవంబర్ 16న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా రవితేజ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం..

మీరు ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం చెయ్యటానికి కారణం ఏమిటి ?

నేను ఏ సినిమా చేసినా.. ఫస్ట్ నాకు కథ నచ్చితేనే చేస్తాను. శ్రీను వైట్ల నాకు ఈ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ స్టోరీ చెప్పినపుడే నాకు స్టోరీ బాగా నచ్చింది. కథకు సంబంధించి నా పరిధిలో కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చాను. ఆ తరువాత, శ్రీను స్క్రిప్ట్ ని ఇంకా బాగా తయారు చేశాడు. వెంటనే మూవీని స్టార్ట్ చేశాము.

అమర్, అక్బర్, ఆంటోనీ ఈ మూడు పాత్రలలో మీరు ఏ పాత్రను ఎక్కువగా ఇష్టపడి చేశారు ?

వ్యక్తిగతంగా, నాకు అమర్ పాత్ర చాలా బాగా నచ్చింది. అమర్ క్యారెక్టరైజేషన్ సినిమాకే ప్రత్యేకంగా నిలుస్తోందని చెప్పొచ్చు. ఇక మిగిలిన రెండు పాత్రలకు సంబంధించిన క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. శ్రీను వైట్ల స్టోరీ చెప్పినప్పుడే నాకు మూడు క్యారెక్టర్స్ లోని వేరియేషన్స్ చాలా బలంగా ఉన్నాయని అనిపించింది. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారు.

ఈ సమయంలో శ్రీను వైట్లతో కలిసి పనిచేయడానికి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా ?

నేను ఎప్పుడూ దర్శకుడిని బాగా నమ్ముతాను అండి. ప్రస్తుతం అతను వరుసగా హిట్స్ ఇచ్చి ఉండిపోవచ్చు. అలా అనుకుంటే..గతంలో నేను కూడా ఫ్లాప్లు ఇచ్చాను. హిట్, ప్లాప్స్ అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఈ సారి మాత్రం శ్రీను వైట్ల నిరాశపరచడు. ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నాడు. ఎందుకంటే తను ఈ సారి తన బలహీనతల పై ఫోకస్ పెట్టి వాట్ని సరిచేసుకొని పని చేశాడు. పైగా మంచి స్క్రిప్ట్ తో వస్తున్నాడు.

ఈ చిత్రంలో మేం ఎక్కువుగా ఏం ఎక్స్ పెక్ట్ చెయ్యచ్చు ?

ఈ సినిమాలో మీరు ఎక్స్ పెక్ట్ చెయ్యనవి కూడా ఉంటాయి. శ్రీను వైట్ల ట్రేడ్ మార్క్ కామెడీతో సహా అన్ని ఎమోషన్స్ ను శ్రీను కవర్ చేశాడు. అన్నిటికి మించి సినిమాలో మంచి భావోద్వేగమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి. సినిమా అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను.

తమన్ ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్నాడు. తమన్ సంగీతం గురించి చెప్పండి ?

ఈ సినిమాకి తమన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అయినా ఇంతలోనే తను ఇప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్ గా 100 సినిమాలను పూర్తి చేశాడంటే.. నేను అసలు నమ్మలేకపోతున్నాను. తమన్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యాడు.

మిమ్మల్ని నెగిటివ్ రోల్స్ లో మేం ఎప్పుడు చూడవచ్చు?

నేను నెగిటివ్ రోల్స్ చెయ్యటానికి నాకు ఇంకా కొంత టైం ఉందనుకుంటున్నాను. నాకు అయితే నెగిటివ్ రోల్స్ చేయకూడదు లాంటి ఆలోచనలు అయితే లేవు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా నెగిటివ్ రోల్స్ తో పాటు అన్ని రకాల పాత్రలు చేస్తాను. కానీ నేను ఏం చేసినా నా పాత్ర చాలా బలంగా ఉండాలని కోరుకుంటాను.

మీరు ‘తేరి’ సినిమాని రీమేక్ చేస్తున్నారా ?

లేదు, నేను ఆ సినిమా చెయ్యట్లేదు. ప్రస్తుతం వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాను. అది త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది.

మీ వర్క్ విషయంలో మిమ్మల్ని విమర్శించే బెస్ట్ క్రిటిక్ ఎవరు ?

నాకు క్లోజ్ గా ఉన్నవాళ్ళందరూ నా సినిమా నచ్చకపోతే నా ముఖం మీద నచ్చలేదని చెప్పేస్తారు. కానీ నాకు సంబంధించి బెస్ట్ క్రిటిక్ అంటే నా కొడుకే. నేను చేసినదాంట్లో చిన్న పొరపాటు ఉన్నా వాడు నా పేస్ మీద చెప్పేస్తాడు.

సంబంధిత సమాచారం :