ప్రభాస్ పక్కన హీరోయిన్ ఖరారు !
Published on Mar 4, 2018 4:54 pm IST

ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమా తరువాత జిల్ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ తో సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ఈ హీరోయిన్ పేరు అధికారికంగా ప్రకటించబోతున్నారు. బాలివుడ్ హీరోయిన్స్ ఈ సినిమాలో చేస్తారు అని వినిపించింది కాని చివరికి పూజా ఈ సినిమా చేయనుంది. ఏప్రిల్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

గోపికృష్ణ మూవీస్ సంస్థలో కృష్ణం రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. నటీనటుల ఎంపిక జరుగుతున్న ఈ సినిమాకు సంభందించిన వివరాలు తెలియాల్సి ఉంది. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ మార్కెట్ పెరిగింది అందుకు తగట్టు కథలు సిద్దం చేస్తున్నారు దర్శకులు.

 
Like us on Facebook