నిఖిల్ కు హీరోయిన్ దొరికినట్టేనా ?
Published on Feb 24, 2018 8:59 am IST

యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కిరాక్ పార్టీ’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండటంతో ఆయన తన తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నారు. తమిళ హిట్ సినిమా ‘కనితన్’కు రీమేక్ గా ఉండనున్న ఈ చిత్రం కోసం బాడీ వర్కవుట్స్ మొదలుపెట్టాడు నిఖిల్. ఈ చిత్రంలో నిఖిల్ కు జోడీ కోసం గత కొన్ని రోజులుగా నిర్మాతలు వెతుకుతున్న సంగతి తెలిసిందే.

ఈ వెతుకులాటలో క్యాథరిన్ థ్రెస, మేఘా ఆకాష్ పేర్లు వినిపించినా చివరకు ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండేను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై కూడ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన టిఎన్. సంతోష్ డైరెక్ట్ చేయనుండగా సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

 
Like us on Facebook