యాక్షన్స్ సీన్స్ లో నటిస్తూ గాయపడిన స్టార్ హీరోయిన్ !
Published on Dec 6, 2018 2:23 pm IST


మలయాళ స్టార్ డైరెక్టర్ సంతోష్ శివన్ దర్శకత్వంలో మలయాళంలో ‘జాక్ అండ్ జిల్’ అనే చిత్రం రూపొందుతుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోన్న మలయాళ టాప్ హీరోయిన్ మంజూ వారియర్ యాక్షన్స్ సీన్స్ లో నటిస్తూ గాయపడింది. మంజూ పై నుంచి కింద పడటం వల్ల ఆమె తలకు పెద్ద దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.

అయితే ఆమెకు గాయం అయిన వెంటనే తేరుకున్న చిత్రబృందం హుటాహుటిన ఆమెను దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉన్నారు. ఇక ఆమె పూర్తిగా కోలుకున్నాకే తమ షూటింగ్ ప్రారంభం అవుతుందని ‘జాక్ అండ్ జిల్’ చిత్రబృందం తెలియజేసింది. కాగా ఈ చిత్రంలో మంజూ వారియర్ కు జోడిగా కాళిదాస్ జయరాం హీరోగా నటిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook