అమితాబ్ కోసం హిందీ నేర్చుకుంటున్న రష్మిక !

అమితాబ్ కోసం హిందీ నేర్చుకుంటున్న రష్మిక !

Published on May 3, 2021 7:00 PM IST


క్రేజీ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన “మిషన్ మజ్ను” అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆలాగే రష్మిక రెండో బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘గుడ్ బై’. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ మెయిన్ హీరో. అమితాబ్ సినిమాలో రష్మిక మెయిన్ క్యారెక్టర్ పోషిస్తోంది. అందుకే ఈ సినిమా కోసం ఆమె ప్రత్యేకంగా హిందీ నేర్చుకుంటుందట. అవసరం అయితే డబ్బింగ్ కూడా ఆమె చెబుతుందట. ఇక ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ లో రష్మిక పాల్గొంది.

ఇక రష్మిక నటిస్తున్న ఆమె ఫస్ట్ బాలీవుడ్ మూవీ ‘మిషన్ మజ్ను’ అక్కడ భారీ అంచనాలు ఉన్నాయి. పైగా బాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో సిద్దార్ట్ మల్హోత్రా సరసన నటిస్తుండంతో రష్మికకి అక్కడ మంచి పాపులారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమా కథ ప్రకారం సౌత్ ఇండియన్ భామ కావాలి కాబట్టి, రష్మికను వాళ్ళు తీసుకున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఒక్క సినిమా సూపర్ హిట్ అయినా, రష్మికకు బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు