ఆ హీరో, డైరెక్టర్ తో పని చెయ్యాలని ఉందన్న హీరోయిన్ !
Published on Oct 23, 2017 1:50 pm IST


‘ప్రేమమ్’, ‘శతమానం భవతి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఆమె నటించిన ‘ఉన్నది ఒక్కటేజిందగి’ ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో చాలా విషయాలు మీడియాతో పంచుకుంది ఈ హీరొయిన్. తనకు ఇష్టమైన దర్శకుడు రాజమౌళి అని అలాగే చిరంజీవి అంటే అభిమానమని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా.. ‘’ఈ మద్య చిరంజీవి గారి 150 వ సినిమా చూశాను, అందులో చిరంజీవి గారి నటన, డాన్స్ చూసి షాకయ్యాను, అంత వయసులో ఆయన పెర్ఫార్మెన్స్ సూపర్, ఆయన పక్కన కొద్దిసేపయినా నటించే అవకాశం వస్తే చాలా ఆనందపడతాను, రాజమౌళి గారి దర్శకత్వంలో పని చెయ్యాలని ఆసక్తిగా ఎదురుచుస్తున్ననాను’’ అని మనసులో మాటను వెల్లడించింది.

 
Like us on Facebook