‘సాహో’ బ్యూటీకి భారీ రెమ్యునరేషన్ !
Published on Aug 16, 2017 1:49 pm IST


‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడం వలన ‘సాహో’ కి సంబందించిన ప్రతి విషయంపై ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా ప్రభాస్ సరసం నటించే అవకాశం ఏ హీరోయిన్ కు దక్కుతుందో చూడాలని అంతా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో పలు పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. చివరికి స్పందించిన నిర్మాతలు నిన్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా కుదిరిందని ప్రకటించేశారు.

ఇకపోతే ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటించేందుకు నిర్మాతలు శ్రద్ధకు రూ. 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారని, ఈ మెమోత్తం ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. మరి ఈ అసలు ఖచ్చితంగా ఎంతో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. సుజీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోంది. ఇటీవలే వారం రోజుల ఒకటో షెడ్యూల్ ముగించి రెండవ షెడ్యూల్ పనుల్లో ఉన్నారు చిత్ర టీమ్.

 
Like us on Facebook