హాలీవుడ్ స్టంట్స్ చేయనున్న ప్రభాస్ ?
Published on Nov 25, 2016 8:19 am IST

Prabhas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ‘బాహుబలి’ షూటింగ్ పూర్తవగానే వెంటనే స్నేహితుడు సుజీత్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాహుబలి విజయంతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ‘బాహుబలి -2’ తరువాత చేయబోయే సినిమా మీద భారీ అంచనాలుంటాయి కాబట్టి వాటికి తగ్గితే సినిమానౌ భారీగా ప్లాన్ చేస్తున్నాడు సుజీత్. చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, హై స్టాండర్డ్స్ లో నిర్మించాలని సంకల్పించారు. అందుకే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ లు ఉండేలా చూస్తున్నారు.

ఇక ఈ ఎపిసోడ్ లు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ రూపొందిస్తారని, ఇవన్నీ హాలీవుడ్ లెవల్లో చాలా గ్రాండ్ గా ఉంటాయని, ఈ యాక్షన్ ఎపిసోడ్ లన్నీ దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాల్లో జరుగుతాయని, వాటి కోసం ప్రభాస్ రెండు నెలల పాటు అక్కడే ఉంటారని తెలుస్తోంది. ఇక సినీ వర్గాల్లో అయితే ఈ చిత్రం జనవరి నెలాఖరు నుండి మొదలయ్యే అవకాశముందనే గుసగుసలు వినిపిస్తున్నాయి కానీ ప్రభాస్, సుజీత్ ల వైపు నుండి ఇంకా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఇకపోతే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మస్తోంది.

 
Like us on Facebook