‘సాహసం శ్వాసగా..’కి ‘ఏమాయ చేశావే’తో లింక్ ఏంటి?
Published on Nov 10, 2016 9:28 pm IST

sss
దర్శకుడు గౌతమ్ మీనన్ – హీరో నాగ చైతన్య కలిసి చేసిన ‘ఏమాయ చేశావే’ సినిమా క్లాసిక్ హిట్ స్థాయి తెచ్చుకొని ఎంతోమందికి ఫేవరైట్ సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కాంబినేషన్‌లో వస్తోన్న మరో సినిమాయే ‘సాహసం శ్వాసగా సాగిపో’. గతేడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి రేపు (నవంబర్ 11న) భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఇక ఇప్పటికే ట్రైలర్, ఆడియోలతో విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

‘ఏమాయ చేశావే’ సినిమా తరహాలోనే ‘సాహసం శ్వాసగా..’ కూడా ఫస్టాఫ్ అంతా సరదాగా రొమాంటిక్ సన్నివేశాలతో నడుస్తుందట. ఏమాయ చేశావే ఫీల్ ఫస్టాఫ్‌లో ఈ సినిమాలోనూ ఉంటుందని తెలుస్తోంది. అయితే సెకండాఫ్ మాత్రం ఫస్టాఫ్‌కు పూర్తి భిన్నంగా థ్రిల్లర్, యాక్షన్ సినిమా తరహాలో నడుస్తుందట. ఈ డిఫరెంట్ నెరేషన్ అభిమానులను అలరిస్తుందని టీమ్ చెబుతూ వస్తోంది. నాగ చైతన్య సరసన మంజిమ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.

 
Like us on Facebook