మహేష్ కోసం భారీ అసెంబ్లీ సెట్ !
Published on Jun 6, 2017 12:50 pm IST


ప్రస్తుతం మురుగదాస్ ‘స్పైడర్’ పనుల్లో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు అవి పూర్తికాగానే కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్ర షూటింగ్లో పాల్గొంటారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో మొదలై ఒక చిన్నపాటి షెడ్యూల్ కూడా ముగింసింది. త్వరలో మొదలుకానున్న కొత్త షెడ్యూల్లో మహేష్ కూడా పాల్గొననున్నారు.

తాజాగా సినీ వర్గాల నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ సిటీ శివార్లలో ఒక భారీ అసెంబ్లీ సెట్ రూపొందిస్తున్నారట. అలాగే మహేష్ ఇందులో ఒక పొలిటీషియన్ గా కనిపిస్తాడనే ,మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే ఇంకొద్ది సమయం వేచి చూడక తప్పదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2018 ఆరంభంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

 
Like us on Facebook